Share News

తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిన యువతి రీల్స్ పిచ్చి!

ABN , Publish Date - Mar 18 , 2026 | 10:45 AM

బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెద్ద పార్శిల్‌ను కొరియర్‌ సర్వీస్‌ ఆఫీసుకు తీసుకెళ్లింది.

తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిన యువతి రీల్స్ పిచ్చి!
Bengaluru viral video

బెంగళూరు, మార్చి 18: నేటి కాలంలో చాలామంది యువత రీల్స్ పిచ్చిలో మునిగి తేలుతున్నారు. వీడియోలు చేసేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇంకొందరు అయితే తమ ప్రాణాలే కాకుండా తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో ఇటీవలే ఓ మహిళ తన బిడ్డను స్కూటీ డిక్కీలో పెట్టిన ఘటన నెట్టింట వైరల్ కాగా.. తాజాగా అదే తరహాలో మరో ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


బెంగళూరుకు చెందిన ఓ యువతి రీల్స్ చేసేందుకు వృద్ధుడైన తన తండ్రిని సంచిలో పెట్టి 'కొరియర్' చేయడానికి ప్రయత్నించింది. తన తండ్రిని ఓ సంచిలో కొరియర్ చేసి.. వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కొరియర్ సర్వీస్ కార్యాలయానికి తీసుకెళ్లింది. తాను చెప్పిన అడ్రస్‪కు ఆ సంచిని పంపించమని కోరింది. అయితే పార్శిల్‌లో ఉన్న వస్తువులను స్పష్టంగా వెల్లడించడానికి యువతి నిరాకరించడంతో సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా.. శ్వాస ఆడని స్థితిలో ఆ వృద్ధుడు ఉన్నాడు. దీంతో వెంటనే కొరియర్ ఆఫీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా... యువతి, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.


ప్రయాణం ఎంత కష్టంగా ఉందో చూపించడానికి ఇలా చేశామని యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రద్దీ ప్రయాణ సమయంలో బస్సులు, రైళ్లలో టిక్కెట్లు దొరకనప్పుడు చివరి ప్రయత్నంగా 'ఒక వ్యక్తిని కొరియర్ ద్వారా పంపడాన్ని' అనే అంశాన్ని హాస్యభరితంగా చిత్రీకరించామని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ తరహా పనులు మరెప్పుడు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువతి, ఆమె కుటుంబ సభ్యులను సమర్థించగా, మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

మళ్లీ పెరిగిన బంగారం ధర..

Updated Date - Mar 18 , 2026 | 10:58 AM