భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:35 AM
భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర చేసినందుకు గతవారం ఒక అమెరికన్‌తోపాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ...
ఒక అమెరికన్ సహా ఆరుగురు ఉక్రెయిన్ పౌరుల అరెస్టు
ఈ నెల 27 వరకూ జ్యుడిషియల్ కస్టడీ
మయన్మార్ మీదుగా మిజోరంలోకి నిందితులు
నిషేధిత తీవ్రవాద సంస్థలకు ఆయుధాల అందజేత
వారి మొబైల్ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా ఎన్‌ఐఏ కేసు
న్యూఢిల్లీ, మార్చి 17: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర చేసినందుకు గతవారం ఒక అమెరికన్‌తోపాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. వారిపై శనివారం కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు. పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశ పెట్టగా తొలుత 3 రోజులు.. సోమవారం ఈ నెల 27 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. వారిపై చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18వ సెక్షన్, ఇతర సెక్షన్ల ఆధారంగా కేసు నమోదైంది. మయన్మార్ మీదుగా మిజోరంలో అడుగు పెట్టిన అనుమానితుల వద్ద నిషేధిత ప్రాంతాల్లో పర్యటనకు అనుమతించే పత్రాలేమీ లేవు. అనుమానితుల వద్ద గల మొబైల్ ఫోన్ల డేటా విశ్లేషణ ఆధారంగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. వీరు భారత్ మీదుగా మయన్మార్‌కు డ్రోన్లలో ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అభియోగాలున్నాయి. దీంతోపాటు భారత్‌లోని నిషేధిత తీవ్రవాద సంస్థలకు వారు ఆయుధాలు అందజేసి, శిక్షణ ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి.