Share News

బెంగళూరు-మైసూర్ హైవేపై దారుణం.. కారు అడ్డు పెట్టి కుటుంబంపై దాడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:41 PM

బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక కుటుంబంపై కొందరు దుండగులు మూకదాడికి తెగబడ్డారు. చిన్న ప్రమాదం కారణంగా కారును వెంబడించి, డ్రైవర్‌ను రోడ్డుపై లాగి కొట్టిన దృశ్యాలు వెనుక వాహనం డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.

బెంగళూరు-మైసూర్ హైవేపై దారుణం.. కారు అడ్డు పెట్టి కుటుంబంపై దాడి.. వీడియో వైరల్
Bengaluru Mysuru Expressway

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక కుటుంబంపై జరిగిన దారుణమైన దాడి ఉదంతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. బిజీగా ఉన్న హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారును కొందరు దుండగులు అడ్డుకుని, బలవంతంగా డోర్లు తెరిచి డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కారులో ఒక మహిళ, చిన్నారితో సహా ఐదుగురు సభ్యులు ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా లోపల ఉన్న వ్యక్తిని బయటకు లాగి ఇనుప రాడ్‌లతో కొట్టారు. కారులో ఉన్న మహిళ బయటకు వచ్చి ఎంత బతిమాలినా వారు వినలేదు. చివరకు తోటి వాహనదారులు, బాటసారులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ భయానక దృశ్యాలన్నీ వెనుక వస్తున్న మరో కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.


ఈ ఘర్షణకు చిన్న ప్రమాదం కారణమని తెలుస్తోంది. శ్రీరంగపట్నం టోల్ గేట్ సమీపంలో ఇరు కార్ల మధ్య చిన్న ప్రమాదం జరగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయినప్పటికీ.. నిందితులు తమ కారును చెక్ చేసుకుంటే.. భారీగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోతూ బాధితుడి కారును హైవేపై వెంబడించి, మద్దూరు సమీపంలో అడ్డుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.


Also Read:

యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి

Updated Date - Jul 07 , 2026 | 01:43 PM