బ్యాంక్ గేటుకు తాళం వేసిన మేనేజర్.. కారణమేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:41 PM
ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జాక్‌పాట్ కొట్టినట్లే.. అనేది అందరి ఫీలింగ్. అదే ప్రభుత్వ రంగం సంస్థ బ్యాంకులో ఉద్యోగం అయితే.. బూరెల బుట్టలో పడినట్లే అని అనుకుంటుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతోన్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జాక్‌పాట్ కొట్టినట్లే.. అనేది అందరి ఫీలింగ్. అదే ప్రభుత్వ రంగం సంస్థ బ్యాంకులో ఉద్యోగం అయితే.. బూరెల బుట్టలో పడినట్లే అని అనుకుంటుంటారు. ఏసీ కింద కూర్చొని నిశ్చింతగా పని చేసుకోవచ్చనేది అందరి అభిప్రాయం. ఉన్నతాధికారులు కూడా కింది స్థాయి సిబ్బందిని ఏమీ అనరని అని అంతా భావిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్యాంక్ మెయిన్ గేట్‌కు తాళం వేసి.. పని పూర్తయిన తర్వాతే ఇంటికి వెళ్లేందంటూ సిబ్బందిని మేనేజర్ ఆదేశించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే ఆ మేనేజర్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగి.. తన సెల్‌ఫోన్‌లో ఇదంతా రికార్డు చేశారు. ఈ వీడియోలో బ్యాంకు ఉద్యోగి తన మేనేజర్ చర్యలను నిరసిస్తూ.. సార్ నా సమయం సాయంత్రం 5 గంటల వరకూ ఉంది. కానీ ఇప్పటికే 6 గంటలు అయింది. దయచేసి గేట్లు తీయండి.. నేను ఇంటికి వెళ్లాలని అంటాడు. కానీ పని పూర్తయ్యే వరకూ ఎవరూ ఇంటికి వెళ్లరంటూ బ్యాంకు మేనేజర్ తెగేసి చెప్పాడు. బ్యాంకు ఉద్యోగి తన పని పూర్తయిందని పదేపదే చెబుతున్నాడు. కానీ మేనేజర్ మాత్రం అతడి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు.
ఈ వైరల్ వీడియోను @Hellobanker_in అనే యూజర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల తమదైన శైలిలో స్పందించారు. చాలా మంది బ్యాంక్ మేనేజర్ చర్యలను విమర్శించారు. మరికొందరు బ్యాంకుల్లో ఉద్యోగుల పరిస్థితి గతంలో లాగా లేదని వివరించారు. ఇక్కడ ఒకే ఉద్యోగి నలుగురి పనిని పూర్తి చేస్తాడని చెప్పారు. బ్యాంకుల్లో పనిభారం తీవ్రంగా ఉంటోందని పేర్కొన్నారు.