Share News

కారును ధ్వంసం చేసిన గజరాజు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:31 PM

నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనట్లుగా ఉంటాయి.

కారును ధ్వంసం చేసిన గజరాజు.. వీడియో వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనట్లుగా ఉంటాయి. కోపంతో ఉన్న ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏమైందో ఏమో.. ఏనుగుకు కోపం వచ్చింది. అంతే.. కారును ఎత్తి పడేసింది.

దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. కారు ముందు భాగంగా పూర్తిగా పాడైపోయింది. వాహనం దాదాపుగా ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో.. అక్కడే పలువురు వ్యక్తులు ఉన్నారు. వారంతా భయంతో పరుగులు తీశారు. సాధారణంగా ఏనుగుకు కోపం రాదు. వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకు గతంలో జరిగిన పలు సంఘటనలే ఉదాహరణ.


ఈ వీడియోను ‘until_next_tym_’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమైన దృశ్యమని కొందరు పేర్కొన్నారు. కారును ఏనుగు తుక్కుగా మార్చేసిందని మరికొందరు అన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 05:41 PM