Share News

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డు

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:02 AM

అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా మూవీ విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ (సినిమాలో నటులు, ప్రదర్శనకారులు కదులుతున్నప్పుడు వారి కదలికలను సెన్సార్లు లేదా కెమెరాలతో కంప్యూటర్‌లో త్రీడీలో క్యారెక్టర్‌కి అనుసంధానం చేయడం) కేటగిరి కింద గిన్నిస్ రికార్డు సాధించింది.

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డు

ఇంటర్‌నెట్ డెస్క్: అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా మూవీ విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ (సినిమాలో నటులు, ప్రదర్శనకారులు కదులుతున్నప్పుడు వారి కదలికలను సెన్సార్లు లేదా కెమెరాలతో కంప్యూటర్‌లో త్రీడీలో క్యారెక్టర్‌కి అనుసంధానం చేయడం) కేటగిరి కింద గిన్నిస్ రికార్డు సాధించింది. ఈనెల 21నే డైరెక్టర్ అట్లీ తన 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో తన సినిమా విడుదలకు ముందే ఈ రికార్డు సాధించడం అతనికి బర్త్‌డే గిఫ్ట్ వచ్చినట్లయింది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం 37 మంది ప్రదర్శనకారులు ప్రదర్శన చేస్తుండగా వారిని మోషన్ క్యాప్చర్ చేశారు. అల్లు అర్జున్, అట్లీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ ‘ఎక్స్’ లో వెల్లడించింది. అల్లు అర్జున్, అట్లీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలు అందజేశారని తెలిపింది. తమ చిత్రం థియేటర్లలోకి రాక ముందే చరిత్ర సృష్టించిందని పేర్కొంది. ‘భారతీయ సినిమాకు ఈ రికార్డు దక్కడం అంతర్జాతీయ విజయం. ఈ రికార్డు మన ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ ఇన్ రియల్ టైమ్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. 37 మంది ప్రదర్శనకారులను ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేశాం’ అని సన్ పిక్చర్స్ తెలిపింది.


అల్లు అర్జున్ హర్షం

రాకా సినిమాకు గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడంపై నటుడు అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మూవీ టీం మొత్తానికి దక్కిన విజయమని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా మొత్తం సినిమా యూనిట్‌ గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. తమ సినిమాకు ఈ రికార్డు అందించి, తమ యూనిట్ ప్రయత్నాలను గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. మోషన్ క్యాప్చర్డ్ వీడియోను ఎలా చిత్రీకరించారో వివరిస్తూ ఈ చిత్రం మేకర్లు ఒక వీడియోను విడుదల చేశారు. కాగా.. రాకా సినిమాలో నాలుగు విభిన్న పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారు. తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల క్యారెక్టర్‌ను ఆయన పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్, రష్మిక మందన్న, జాహ్నవి కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Also Read:

వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

ఫారాలు ఇచ్చినా.. పేర్లు గల్లంతు..!

భారత్‌కు భద్రతా మండలిలో సభ్యత్వం.. నాలుగు యూరప్ దేశాల మద్దతు..

Updated Date - Sep 22 , 2026 | 10:12 AM