Share News

‘14 నిమిషాలు యాక్టివ్‌గా లేనని తొలగించారు’.. మహిళా ఉద్యోగి ఆవేదన

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:04 PM

ఏఐ ఆధారిత వర్క్ ప్లేస్ మానిటరింగ్ వ్యవస్థ కారణంగా ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. 14 నిమిషాల పాటు ఆమె తన పనిలో యాక్టివ్‌గా లేదని ఏఐ డ్యాష్ బోర్డ్ గుర్తించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

‘14 నిమిషాలు యాక్టివ్‌గా లేనని తొలగించారు’.. మహిళా ఉద్యోగి ఆవేదన

ఇంటర్‌నెట్ డెస్క్: ఏఐ ఆధారిత వర్క్ ప్లేస్ మానిటరింగ్ వ్యవస్థ కారణంగా ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. 14 నిమిషాల పాటు ఆమె తన పనిలో యాక్టివ్‌గా లేదని ఏఐ డ్యాష్ బోర్డ్ గుర్తించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సదరు బాధితురాలు ‘ఎక్స్’లో తెలిపింది. ‘14 నిమిషాల పాటు నేను ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు ఏఐ డ్యాష్ బోర్డు గుర్తించింది. వాస్తవానికి ఆ టైంలో నేను పనిచేస్తూనే ఉన్నాను. ఎలాంటి బ్రేక్ తీసుకోలేదు. అప్పుడు ఓ క్లైంట్‌కు సాయం చేయడానికి నేను కిందకు వెళ్లాను. కానీ, నేను ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు ఏఐ సిస్టమ్ ట్రాక్ చేసిందని నా బాస్ నాకు చెప్పాడు. నా బ్యాడ్జ్ తీసుకుని నన్ను పనిలో నుంచి తొలగించారు’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే, తన బాస్ ఏఐ అకౌంట్‌ను తాను యాక్సె్స్ చేశానని, వారంలో నాలుగున్నర గంటలు మాత్రమే ఆయన యాక్టివ్‌గా ఉన్నట్లు ఆ డ్యాష్ బోర్డు చూపిందని ఆరోపించారు.


‘ప్రతిదానికీ తన పెంపుడు కుక్క పేరును పాస్‌వర్డ్‌గా వాడతానని ఇంతకుముందు నా బాస్ నాకు చెప్పాడు. ఆ పాస్‌వర్డ్ తోనే నేను ఆయన అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాను. ఆయన యాక్టి‌వ్‌గా ఉన్న గంటలను మా ఓనర్ సహా మొత్తం కంపెనీకి పంపాను. ఆ తర్వాత ఏకధాటిగా మూడు గంటల పాటు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు నా బాస్ కనిపించాడు’ అని ఆమె వివరించింది. కాగా.. ఎంప్లాయి మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌తో ప్రొడక్టివిటీని కచ్చితంగా అంచనా వేయవచ్చా లేదా అనే దానిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పనిలో కాస్త బ్రేక్ తీసుకున్నప్పుడు అలాంటి సాఫ్ట్‌వేర్ ఇచ్చే డేటాను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, సీరియస్ కేసుల్లోనే అలాంటి వాటిని వాడాలని పలువురు యూజర్లు అభిప్రాయపడ్డారు. పనిలో కాస్త బ్రేక్ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగి పని నుంచి తప్పించుకున్నట్లు కాదని పేర్కొన్నారు.


Also Read:

నాకు జీవించాలని లేదు.. టోర్నీ నుంచి తప్పించడంపై అథ్లెట్‌ ఆవేదన

వినాయకుడిని ఇంటికి తీసుకొస్తున్నారా? ముందుగా ఈ ఏర్పాట్లు చేయండి

ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి: కిషన్ రెడ్డి

Updated Date - Sep 12 , 2026 | 06:37 PM