గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:42 AM
నీటిపై రాకెట్‌లా దూసుకెళ్తున్న పవర్‌బోట్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమెరికాలో హైస్పీడ్ బోట్ రేసులో సరిగ్గా ఇదే జరిగింది. గంటకు సుమారు 343 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న పడవ అకస్మాత్తుగా గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో జరిగిన పవర్‌బోట్ రేసులో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. గంటకు సుమారు 343 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న ఓ రేసింగ్ పడవ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. వేగం తీవ్రంగా ఉండటంతో చూస్తుండగానే పడవ మొత్తం గాల్లో గింగిరాలు తిరిగింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు, ఇతర రేసింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అనూహ్యంగా పడవ తిరిగి నీటిపై ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటన రేసులోని కెమెరాల్లో రికార్డ్ కావడంతో ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతటి వేగంతో గాల్లోకి ఎగిరిన పడవ నేరుగా నీటిపైకి తిరిగి యథావిధిగా పడడడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో పడవ బోల్తా పడటం లేదా అదుపు తప్పి నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ ఘటనలో అదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..
ఆదాయానికి మంచి ఆస్తుల కేసు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
Read Latest AP News And Telugu News