Share News

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:14 PM

సమోసా కనిపిస్తే చాలు.. ఒక్కటైనా తినాలనిపిస్తుంది. కానీ ఒకేసారి 106 సమోసాలు కనిపిస్తే? వాటిని కూడా అవలీలగా తినేస్తే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇదే సీన్ కనిపించింది. రకరకాల ఫ్లేవర్లతో ఉన్న సమోసాలను ఒక్కొక్కటిగా రుచి చూస్తూ ఓ వ్యక్తి చేసిన ఈ ఫీట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఒకటి కాదు, రెండు కాదు..  గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సమోసా.. ఈ పేరు వింటేనే ఎవరికైనా నోరూరిపోతుంది. ఆలూతో చేసే సమోసాల నుంచి ప్రాంతానికో ప్రత్యేకమైన రుచితో తయారు చేసే సమోసాలు అంటే ఎవరైనా ఇష్టపడతారు. కోల్‌కతాలో ‘షింగారా’గా పిలిచే సమోసాలు, పలుచని కరకరలాడే పొరతో చేసే ‘పట్టి సమోసాలు’ ఇలా ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన జెర్మాట్ నియో.. ఏకంగా 106 సమోసాలను తిని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదట కర్రీ చికెన్ సమోసాతో మొదలుపెట్టిన జెర్మాట్.. ఒక్కొక్కటిగా రకరకాల సమోసాలను తినడం వీడయోలో చూడొచ్చు.


ఈ ఛాలెంజ్‌లో సాధారణ సమోసాలతో పాటు ఎన్నో వెరైటీలు ఉండటం మరింత ఆసక్తిని కలిగించింది. కర్రీ పఫ్స్‌ను తలపించే సమోసాలు, సటే సమోసా, దక్షిణాది స్టైల్ సమోసాలు, బటర్ చికెన్ సమోసా, గ్రిల్డ్ చీజ్ సమోసా వంటి రుచులను జెర్మాట్ ప్రయత్నించాడు. చట్నీలతో పాటు ఇంట్లో తయారుచేసిన మారినారా సాస్‌లోనూ సమోసాలను ముంచుతూ తిన్నాడు. ఇక బీట్‌రూట్ ఫెటా, కీ లైమ్ పై, క్రీమ్ బ్రూలీ వంటి అసాధారణ రుచుల సమోసాలు కూడా ప్లేటర్‌లో ఉండటంతో వీడియో మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రిల్డ్ చీజ్ సమోసాను కెమెరాకు చూపిస్తూ తినడం మరింత ఆకట్టుకుంది. చివరి వరకూ ఛాలెంజ్‌ను కొనసాగిస్తూ సమోసాల విందును ఆస్వాదించిన జెర్మాట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది నెటిజన్ల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో 4 మిలియన్ల వీక్షణలను దాటింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘సమోసాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘అన్ని సమోసాలు తింటుంటే ‘మోటూ పత్లూ’ కార్టూన్ గుర్తుకు వస్తుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇన్ని సమోసాలు ఎలా తిన్నాడు.. మనిషా? మిషనా?’ అని కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ శాఖలో పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 18 , 2026 | 03:26 PM