Share News

అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ABN , First Publish Date - Jan 03 , 2026 | 06:44 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
Breaking News

Live News & Update

  • Jan 03, 2026 11:51 IST

  • Jan 03, 2026 11:51 IST

    అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • మొదట గృహజ్యోతిపై ఎమ్మెల్యేలు మధు సూదన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, నాగరాజు ప్రశ్నలు

    • సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఓట్టి విక్రమార్క

  • Jan 03, 2026 11:47 IST

    రష్యా నుంచి చమురు దిగుమతుల వివరాలు ఇవ్వాలని రిఫైనరీలను ఆదేశించిన కేంద్రం

    • అమెరికాతో ట్రేడ్‌ డీల్‌తో కేంద్రం చర్యలు

  • Jan 03, 2026 11:43 IST

    అల్లూరి: అరకులోయలో దారుణం

    • అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రూమ్‌లో మృత శిశువు కలకలం

    • నిన్న శిశువుకు జన్మనిచ్చి వెళ్లిపోయిన ఓ మహిళ

    • మృత శిశువుకి జన్మనిచ్చిందా లేదా ప్రసవం తర్వాత చనిపోయిందా అన్న దానిపై రాని స్పష్టత

    • మృత శిశువు ఆస్పత్రిలో ఉండగా గుర్తించిన సిబ్బంది

    • సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న ఆస్సత్రి సిబ్బంది, దర్యాప్తు చేస్తున్న అరకులోయ పోలీసులు

  • Jan 03, 2026 11:27 IST

    నూజివీడు మ్యాంగో బే క్లబ్‌కు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట

    • పేకాట ఆడించవద్దని మ్యాంగో బే క్లబ్‌కు ఏపీ హైకోర్టు ఆదేశం

    • విచారణకు సహకరించాలని మ్యాంగో బే క్లబ్‌కు ఆదేశం

    • పేకాటకు హైకోర్టు అనుమతి ఉందంటూ క్లబ్‌ నిర్వాహకులు ఫ్లెక్సీలు

  • Jan 03, 2026 11:24 IST

    కాంగ్రెస్ ప్రభుత్వం అనైతిక విధానాలు అవలంభిస్తోంది: హరీష్‌రావు

    • సంప్రదాయాలు అంటూ ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు నీతులు చెబుతారు

    • కాంగ్రెస్‌ పాలనలో సంప్రదాయాలు తుంగలో తొక్కారు: హరీష్‌రావు

  • Jan 03, 2026 11:24 IST

    కొండగట్టుకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

    • జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌

  • Jan 03, 2026 11:22 IST

    హైదరాబాద్‌: అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ రైతుల యత్నం

    • అడ్డుకుని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

    • జిల్లాలో కొరటా-చనాకా ప్రాజెక్ట్ పూర్తిచేయాలని రైతుల డిమాండ్‌

  • Jan 03, 2026 11:10 IST

    చిత్తూరు: కుమార్తెపై తండ్రి అత్యాచారం, పోక్సో కేసు నమోదు

    • మొదటి భార్య కుమార్తెపై తండ్రి అత్యాచారం

    • చిత్తూరు: బాలిక నానమ్మ అడ్డుకోగా దాడి చేసి నిందితుడు పరారీ

  • Jan 03, 2026 11:10 IST

    బాపట్ల: నిజాంపట్నం హార్బర్ దగ్గర చేపల బోటులో అగ్నిప్రమాదం

    • జెట్టీ దగ్గర ఆపి ఉంచిన బోటులో ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటలు

    • మంటలు చెలరేగడంతో బోటులో నుంచి దూకేసిన మత్స్యకారులు

    • బాపట్ల: అగ్నిప్రమాదంలో బోటు, వలలు దగ్ధం

  • Jan 03, 2026 11:09 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ అరెస్ట్‌

    • BRS భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jan 03, 2026 11:09 IST

    తమిళనాడు పుదుక్కోట్టైలో జల్లికట్టు పోటీలు

    • 12 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

  • Jan 03, 2026 11:09 IST

    ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

    • ఇద్దరు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు

  • Jan 03, 2026 11:07 IST

    నల్లగొండ: పట్టణంలోని మునిసిపల్ వార్డులలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ బి.చంద్రశేఖర్

    • స్థానికులతో ముఖాముఖి.. మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై ఆరా

    • పారిశుద్ధ్యం, మురికి కాలువల పరిశుభ్రత పరిశీలన

    • డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశం

    • వీధులలో చెత్త పోస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు

  • Jan 03, 2026 11:07 IST

    కడప: అట్టహాసంగా ప్రారంభమైన కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

    • పోలీస్ పరేడ్ మైదానంలో నేటి నుంచి 5 వరకు జరగనున్న క్రీడలు

    • కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు సబ్ డివిజన్లు, ఏఆర్ నుంచి పాల్గొంటున్న క్రీడాకారులు

    • క్రీడలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

  • Jan 03, 2026 11:05 IST

    స్విట్జర్లాండ్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రమాదంలో ట్విస్ట్‌

    • వైన్ సీసా క్యాండిల్‌ వల్లే ప్రమాదం జరిగిందని గుర్తింపు

    • రిసార్ట్‌లో అగ్నిప్రమాదంతో 40 మంది మృతి, 120 మందికి గాయాలు

  • Jan 03, 2026 11:05 IST

    గుంటూరు: ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ

    • శ్రీనివాస కల్యాణంతో తెలుగు మహాసభలకు శ్రీకారం

    • కల్యాణంలో పాల్గొన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  • Jan 03, 2026 11:05 IST

    ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా ప్రారంభం

    • త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు

    • ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న మాఘ మేళా

  • Jan 03, 2026 11:02 IST

    ఢిల్లీలో మెరుగపడ్డ వాయు నాణ్యత

    • గాలి వేగం పెరగడంతో తగ్గిన కాలుష్యం, పొగమంచు

    • ఢిల్లీలో AQI 235 పాయింట్లుగా నమోదు

  • Jan 03, 2026 11:01 IST

    మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

  • Jan 03, 2026 07:57 IST

    నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • తెలంగాణ శాసనసభలో నేడు జలాలు నిజాల పై లఘు చర్చ

    • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

    • ఉదయం 10గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం

    • మొదట ప్రశ్నోత్తరాలు

    • అనంతరం బిల్లుల పై చర్చ

    • నేడు అసెంబ్లీకి 4కీలక బిల్లులు

    • చర్చించి ఆమోదించనున్న శాసన సభ

  • Jan 03, 2026 07:57 IST

    నేడు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో సమావేశంకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    • ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్

    • నేడు సభకు హాజరు కావొద్దని బీఆర్ఎస్ నిర్ణయం

    • సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ ఆరోపణ

    • తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న బీఆర్ఎస్