Share News

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

ABN , First Publish Date - Jan 02 , 2026 | 07:21 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
Breaking News

Live News & Update

  • Jan 02, 2026 10:10 IST

    రెండో రోజు ప్రారంభమైన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

    • సభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

    • యూరియా కొరత పై చర్చకు పట్టుబడుతున్న బి.ఆర్.ఎస్

    • ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

  • Jan 02, 2026 10:08 IST

    నంద్యాల: చాబోలు వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

    • ఆరుగురు ప్రమానికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు

  • Jan 02, 2026 08:38 IST

    నంద్యాల : శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు మద్యం పట్టివేత

    • వాహనాల తనికీలలో బాగంగా పోలీసులకు పట్టుబడ్డ 47 మద్యం క్వార్టర్ బాటిళ్లు

    • నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్ పై మద్యం తెస్తూ పట్టుబడిన నిందితులు

    • 47 మద్యం బాటిళ్లు సీజ్ చేసిన పోలీసులు మాండ్ల కొలనుభరత్ గొళ్ల మాసయ్య లను అరెస్టు చేసిన శ్రీశైలం పోలీసులు

    • ఆత్మకూరులో మద్యం కొనుగోలు చేసి శ్రీశైలంలో ఎక్కువరేటుకు అమ్మెందుకు మద్యం బాటళ్లను తెచ్చినట్లు వెల్లడించిన సిఐ జీవన్ గంగనాధ బాబు

  • Jan 02, 2026 08:36 IST

    బళ్లారి కాల్పుల ఘటనలో 11 మందిపై కేసులు నమోదు

    • గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి సహా 11మందిపై కేసు నమోదు

    • మోత్కార్ శ్రీనివాస్‌, ప్రకాష్‌రెడ్డి, రాముడు, పలన్న,..

    • దివాకర్‌, మారుతిప్రసాద్‌, దమ్మూర్‌ శేఖర్‌, అలీఖాన్‌పై కేసులు

  • Jan 02, 2026 08:36 IST

    తెలంగాణలో పలు ప్రాంతాల్లో పొగమంచు

    • గోదావరి నదీ ప్రాంతంలో పెరిగిన చలిగాలుల తీవ్రత

    • ములుగు ఏజెన్సీ ప్రాంతాలను కప్పేసిన పొగమంచు

    • వరంగల్-హైదరాబాద్ హైవేపై దట్టంగా పొగమంచు

    • సిరిసిల్లలో పొగమంచు ప్రయాణికులకు ఇక్కట్లు

    • హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పొగమంచు

  • Jan 02, 2026 08:33 IST

    శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో అర్ధరాత్రి చిరుత కలకలం

    • సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన పులి సంచరించిన దృశ్యాలు

    • అప్రమత్తమైన ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు

    • పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేయిస్తున్న అధికారులు

    • శ్రీశైలంలోని ఆదే గృహంలొ గతంలోనూ సంచరించిన చిరుతపులి

  • Jan 02, 2026 08:31 IST

    అనకాపల్లి జిల్లా: కోటవురట్ల మండలంలో పూరిపాక కు నిప్పంటుకోవడంతో వృద్దురాలు మృతి

    • మృతురాలు కైలాసపట్నం గ్రామానికి చెందిన కొయ్య మాణిక్యం(85)గా గుర్తింపు

    • అర్థరాత్రి చలికి కుంపటి పెట్టుకొని మంచంపై పడుకుని ఉండగా దుప్పటికి నిప్పు అంటుకుని మంచంతో సహా పూరిపాక దగ్ధం

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కోటవురట్ల పోలీసులు

  • Jan 02, 2026 08:31 IST

    ఇరాన్ నిరసనల్లో ఏడుగురు మృతి

    • టెహరాన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన 30 మందిని అరెస్ట్ చేసిన ఇరాన్‌

  • Jan 02, 2026 08:29 IST

    రేపు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

    • 3 రోజులు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు

  • Jan 02, 2026 08:28 IST

    నేటి నుంచి 3 రోజులు అండమాన్‌లో అమిత్‌ షా పర్యటన

    • పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీ భేటీకి అమిత్‌ షా

  • Jan 02, 2026 08:28 IST

    నేడు బొగ్గు శాఖపై ప్రధాని మోదీ సమీక్ష

    • హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • Jan 02, 2026 08:04 IST

    హైదరాబాద్‌: ముసారాంబాగ్‌ దగ్గర రోడ్డు ప్రమాదం

    • బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, దంపతులు మృతి

    • మృతులు తిరుమలరావు, వెంకటరమణగా గుర్తింపు

    • బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jan 02, 2026 07:21 IST

    నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభ

    • నేటి సభలో మొదట ప్రశ్నోత్తరాలు

    • మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చ

    • మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • GHMC బిల్లుతో పాటు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం