యాదగిరీశుడికి రికార్డు స్థాయిలో ఆదాయం
ABN, Publish Date - Mar 10 , 2026 | 08:35 PM
యాదగిరిగుట్ట (యాదాద్రి) లో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు సంబంధించి భక్తుల హుండీ ద్వారా సమర్పించుకున్న కానుకలను మంగళవారం దేవస్థానం అధికారులు లెక్కించారు.
1/8
యాదగిరిగుట్ట (యాదాద్రి) లో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు సంబంధించి భక్తుల హుండీ ద్వారా సమర్పించుకున్న కానుకలను మంగళవారం దేవస్థానం అధికారులు లెక్కించారు.
2/8
ఈ లెక్కింపులో స్వామివారికి భారీగా నగదు, బంగారం, వెండి విరాళాలు అందినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవానీ శంకర్ ప్రకటించారు.
3/8
గత 28 రోజులకు గాను హుండీ ద్వారా మొత్తం రూ. 1,86,44,511 (ఒక కోటి ఎనభై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు) నగదు ఆదాయం లభించింది.
4/8
స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో భక్తుల రద్దీ పెరగడంతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
5/8
స్వామివారికి 57.500 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల750 గ్రాముల వెండిని సమర్పించారు.
6/8
కొండపై హుండీ లెక్కింపు హాల్‌లో సిబ్బంది, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
7/8
యాదగిరి నరసింహుడికి విదేశీ భక్తుల తాకిడి పెరిగినట్లు హుండీ ఆదాయం స్పష్టం చేస్తోంది.
8/8
అమెరికా: 329 డాలర్లు, వియత్నాం: 3,01,000 డోంగ్స్, హాంకాంగ్: 510 డాలర్లు, కెనడా: 160 డాలర్లు, ఇంగ్లాండ్: 40 పౌండ్స్, ఇండియోనేషియా (1000), దక్షిణాఫ్రికా (50), ఆస్ట్రేలియా, యూరప్, మలేషియా తదితర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు హుండీలో లభించాయి.
Updated at - Mar 10 , 2026 | 08:36 PM