నషా ముక్త్ భారత్ యాత్ర.. సినీ ప్రముఖులకు కిషన్‌రెడ్డి ఆహ్వానం
ABN, Publish Date - Nov 15 , 2026 | 06:35 AM
హైదరాబాద్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ నషా ముక్త్ భారత్’ యాత్రకు సినీ ప్రముఖులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ప్రముఖ నటుడు చిరంజీవి, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్‌లను ఆహ్వానం పలికారు.
1/12
హైదరాబాద్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్’ యాత్రకు సినీ ప్రముఖులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు.
2/12
ప్రముఖ నటుడు చిరంజీవి, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్‌లను ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
3/12
ఈ కార్యక్రమంలో యువతతో పాటు ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
4/12
యువతను, ప్రజలను ఏకం చేసే ఈ మహత్తర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు చిరంజీవి సానుకూలత వ్యక్తం చేశారు.
5/12
మరోవైపు ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా కిషన్‌రెడ్డి ఆహ్వానించారు.
6/12
ఈ క్రమంలో పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారు.
7/12
మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
8/12
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
9/12
అలాగే ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ను కలిసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
10/12
ప్రచారానికి సంబంధించిన టీ-షర్టును ఆయనకు అందజేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, పౌరులందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై చర్చించారు.
11/12
సమాజంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సినీ ప్రముఖులు, యువత, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇవ్వనున్నారు.
12/12
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ఈ యాత్రను విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated at - Nov 15 , 2026 | 07:35 AM