గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఆర్టీసీ కార్మికులు
ABN, Publish Date - Oct 09 , 2026 | 01:14 PM
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 5.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
1/10
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 5.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
2/10
రాష్ట్రవ్యాప్తంగా 97 బస్సు డిపోల్లో పోలింగ్ సాగుతోంది.
3/10
కార్మికుల కోసం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 32, హైదరాబాద్ జోన్‌లో 38, కరీంనగర్ జోన్‌లో 45 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.
4/10
ప్రతి కార్మికుడికి రెండేసి ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం ఒకటి, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం మరో ఓటు వినియోగించుకోవచ్చు.
5/10
పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. ప్రధాన పోరు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ వర్కర్స్ యూనియన్ కూటముల మధ్య ఉంది.
6/10
ఈ ఎన్నికల్లో మొత్తం 34,899 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు.
7/10
వారిలో 14,514 మంది కండక్టర్లు, 13,769 మంది డ్రైవర్లు, 4,207 మంది గ్యారేజీ సిబ్బందితోపాటు 2,409 మంది ఇతరులు ఉన్నారు.
8/10
జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 13,797 మంది, కరీంనగర్ జోన్‌లో11,392 మంది, హైదరాబాద్ జోన్‌లో 9,303 మంది, ప్రధాన కార్యాలయంలో 274 మంది, బస్‌బాడీ యూనిట్ మియాపూర్‌లో 133 మంది ఉన్నారు.
9/10
దూరప్రాంత సర్వీసుల్లో డ్యూటీలో ఉన్న ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని 14,15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించారు.
10/10
ఈ నెల 17న ఈ ఓట్లు లెక్కిస్తారు.
Updated at - Oct 09 , 2026 | 01:33 PM