సీఎం రేవంత్‌రెడ్డికి కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డ్
ABN, Publish Date - Sep 26 , 2026 | 07:48 AM
ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ మహమ్మద్- 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించారు. కేరళంలోని నలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును రేవంత్‌కు ప్రదానం చేశారు.
1/8
ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ మహమ్మద్- 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించారు. కేరళంలోని నలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును రేవంత్‌కు ప్రదానం చేశారు.
2/8
రైతులు, బీసీలు, సామాన్య పౌరుల సంక్షేమ పాలనకు గుర్తింపుగా రేవంత్‌కు ఈ అవార్డును ప్రకటించినట్లు జ్యూరీ తెలిపింది.
3/8
ఈ సందర్భంగా ప్రజాస్వామిక విలువలపై రేవంత్‌రెడ్డి నిబద్ధతను జ్యూరీ ప్రశంసించింది.
4/8
కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ఐదు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఆర్యదాన్ మహమ్మద్.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
5/8
ఆర్యదాన్ మహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును తాను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. కేరళం రాష్ట్రం వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా తాను నిలవడం మరింత ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్ గాంధీ నాయకత్వంలోని బృందంలో కార్యకర్తగా తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నానని తెలిపారు.
6/8
నీలంబూర్‌తోపాటు కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బలమైన శక్తిగా నిలిచారని ప్రశంసించారు.
7/8
జీవితాంతం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆర్యదాన్ మహమ్మద్ పని చేశారని సీఎం కొనియాడారు. ప్రస్తుతం మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం ఉందని అన్నారు. స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఆర్యదాన్ మహమ్మద్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
8/8
దేశంలో కేరళం రాజకీయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, దేశ రాజకీయాలకు ఈ రాష్ట్రం బెల్ వెదర్ (మార్పునకు సూచి) వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated at - Sep 26 , 2026 | 10:14 AM