కుమురం భీం జిల్లాలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Jun 02 , 2026 | 07:19 AM
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కొత్తగూడ కొఠారిలో సోమవారం రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
1/11
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కొత్తగూడ కొఠారిలో సోమవారం రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
2/11
రాష్ట్రంలో కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
3/11
గతంలో ప్రకటించిన 4.50లక్షల ఇళ్లలో 1.20 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయని, సెప్టెంబరు 17వ తేదీ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
4/11
ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి లేమిపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
5/11
ఆదిలాబాద్ జిల్లా అనగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గుర్తుకువస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ఈ ప్రాజెక్టును గత పాలకులు పడావు పెట్టారని విమర్శించారు.
6/11
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్దకు ప్రాజెక్టును తీసుకెళ్లి, రూ.లక్ష కోట్లను కేసీఆర్ హయాంలో ఖర్చు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కూళేశ్వరం కావడం, లక్ష కోట్లు గంగలో కలిసిపోయాయని చెప్పుకొచ్చారు.
7/11
ఆదిలాబాద్‌లో ఎకరానికి కూడా నీళ్లు రాలేదని తెలిపారు. ఇంతకుముందే కుమ్రం భీం ప్రాజెక్టును చూశానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 10 టీఎంసీల ప్రాజెక్టుకు రిపేర్లు చేయకపోవడం వల్ల కేవలం 4 టీఎంసీల నీటిని మాత్రమే నిలుపుకొనే పరిస్థితి ఉందని చెప్పారు.
8/11
కుమురం భీం జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పడావు పడ్డాయని అన్నారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని వివరించారు.
9/11
ఆనాడు వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
10/11
ఈ విషయంపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆయన ఇంతవరకు స్పందించలేదని అన్నారు. అంతరాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని ప్రస్తావించారు.
11/11
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశానికి సమయం ఇవ్వాలంటూ మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను ఏడాదిగా కోరుతున్నానని.. అయినా ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మీరు సమయం ఇవ్వకపోతే... ఆ సమస్య తీవ్రంగా మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Jun 02 , 2026 | 07:23 AM