యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Jul 09 , 2026 | 09:48 PM
గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ ప్రారంభోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి IOA అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష, మంత్రి వాకాటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు.
1/14
గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ ప్రారంభోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి IOA అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష, మంత్రి వాకాటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు.
2/14
ఈరోజు (గురువారం) గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను సీఎం ప్రారంభించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్శిటీని ప్రారంభించారు. స్పోర్ట్స్ వర్శిటీ వెబ్‌సైట్, లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
3/14
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
4/14
క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
5/14
దేశానికి అకాడమీలు, వసతులు అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
6/14
క్రీడల్లో భారత్ వెనుకబడి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రీడల పతకాల పట్టికలో.. భారత్ అట్టడుగు స్థానంలో ఉంటోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
7/14
క్రీడాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు. పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దేశం గర్వించే క్రీడాకారులు, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
8/14
ఏ రంగంలోనైనా కష్టపడేవారు తప్పకుండా రాణిస్తారని అన్నారు. క్రీడలపై యువత దృష్టి సారించాలని సూచించారు. యువతే ఈ దేశ సంపద అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
9/14
ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వెనుకపడిందని సీఎం తెలిపారు. ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు.
10/14
అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులు క్రీడల్లో దేశానికి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
11/14
క్రీడల్లో రాణించి ఆమె రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
12/14
అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని వివరించారు. స్పోర్ట్స్ యూనివర్శిటీని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో ప్రారంభించామని సీఎం వెల్లడించారు. లక్ష్యాన్ని చేరాలంటే వందశాతం కష్టపడాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
13/14
రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
14/14
డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వివరించారు. క్రీడల్లో రాణిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకువస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Jul 09 , 2026 | 10:02 PM