గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లో పోలీసుల తనిఖీలు.. రిహార్సల్స్
ABN, Publish Date - Jan 24 , 2026 | 06:27 PM
దేశవ్యాప్తంగా జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శనివారం పోలీసులు భారీ తనిఖీలు నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేగ్రౌండ్స్‌లో పోలీసుల రిహార్సల్స్, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరిగాయి.
1/15
దేశవ్యాప్తంగా జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
2/15
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
3/15
ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లలో భాగంగా రైల్వే రక్షణ దళం (RPF), రైల్వే పోలీస్ (GRP), తెలంగాణ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
4/15
ప్రయాణికుల భద్రతలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు కొనసాగాయి. రాష్ట్ర పోలీసులే కాక, రైల్వే పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు.
5/15
స్టేషన్‌లో లేదా రైల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే '100' లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
6/15
ఈ భారీ భద్రతా చర్యలు ప్రజల భద్రతను కాపాడటానికి తీసుకున్న కీలకమైన ప్రయత్నమని పోలీసులు తెలిపారు.
7/15
అలాగే సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో పోలీసుల రిహార్సల్స్, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరిగాయి.
8/15
ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో భాగంగా డాగ్ స్క్వాడ్‌తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
9/15
ఈ సందర్భంగా ఫుల్ డ్రెస్ కోడ్ రిహార్సల్ నిర్వహించారు. రైల్వే ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడం కోసం ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
10/15
ప్రజల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
11/15
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
12/15
రైల్వే పోలీసులకు, రాష్ట్ర పోలీసులకు సంబంధించిన సిబ్బంది 24 గంటలు ముందుగా రైల్వే స్టేషన్లలో, పార్కింగ్ ప్రాంతాలు, ప్రయాణికుల మెట్రో, పబ్లిక్ ఏరియా లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
13/15
ప్రయాణికుల బ్యాగులు, ఇతర వస్తువులను స్కానర్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు.
14/15
బాంబు స్క్వాడ్, శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో ప్లాట్‌ఫారమ్‌లు, రైలు బోగీలు, వెయిటింగ్ హాల్స్‌ను తనిఖీ చేశారు.
15/15
కేవలం రైల్వే స్టేషన్లే కాకుండా, హైదరాబాద్‌లోని బస్టాండ్లు, విమానాశ్రయం, ప్రముఖ మాల్స్ వద్ద కూడా నిఘా పెంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే పబ్లిక్ గార్డెన్స్, ఇతర ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేసి, గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను విచారించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.
Updated at - Jan 24 , 2026 | 07:19 PM