శివరాత్రి వేళ.. పరమ శివుడి అనుగ్రహం కోసం..
ABN, Publish Date - Feb 15 , 2026 | 11:03 AM
పర్వదినాల మాసం మాఘ మాసం. ఈ మాసంలో వచ్చే చివరి పర్వదినం మహా శివరాత్రి. ఈ ఏడాది ఈ పండగ ఆదివారం వచ్చింది. సూర్యుడికి ఇష్టమైన రోజు.. ఆదివారం. సూర్యుడికి అధిదేవత రుద్రుడు. అలాంటి మాఘమాసంలో వచ్చిన ఆదివారం మహాశివరాత్రి కూడా కావడంతో.. ఈ రోజు సూర్యారాధన, శివారాధన కలిపి చేయడం వల్ల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
1/12
పర్వదినాల మాసం మాఘ మాసం. ఈ మాసంలో వచ్చే చివరి పర్వదినం మహా శివరాత్రి. ఈ ఏడాది ఈ పండగ ఆదివారం వచ్చింది. సూర్యుడికి ఇష్టమైన రోజు.. ఆదివారం.
2/12
సూర్యుడికి అధిదేవత రుద్రుడు. అలాంటి మాఘమాసంలో వచ్చిన ఆదివారం మహాశివరాత్రి కూడా కావడంతో.. ఈ రోజు సూర్యారాధన, శివారాధన కలిపి చేయడం వల్ల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
3/12
శివరాత్రి రోజు.. భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేయాలంటారు. పరమ శివుని అనుగ్రహం కోసం శివరాత్రి ముందు రోజు అంటే.. శనివారం భక్తులు మార్కెట్లకు పోటెత్తారు.
4/12
నీలకంఠుడిని సేవించుకోవడం కోసం.. పూలు, పళ్ల కోనుగోలు చేయడం కోసం హైదరాబాద్ మహానగరంలోని మోండా మార్కెట్, కూకట్‌పల్లి జెఎన్‌టీయూ కాలేజీ ప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసి పోయాయి.
5/12
సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదేనంటారు.
6/12
ఈ పవిత్రమైన రోజు.. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. ప్రతిఒక్కరూ తలస్నానం చేయాలి.
7/12
శివాలయానికి వెళ్లి.. శివయ్యకు అభిషేకం చేయించాలి. ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి.
8/12
మరి ముఖ్యంగా ఈ రోజు.. ఉదయం, ప్రదోష కాలంలో.. రాత్రి సమయంలో మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం (అర్ధరాత్రి 11.30 నుంచి 12.30 గంటల మధ్య కాలంలో శివారాధన చేయాలి.
9/12
ఆదివారం మహా శివరాత్రి రావడం వల్ల ఈ రోజు శివారాధన చేసిన వారికి అనారోగ్య సమస్యలు తొలుకుతాయి. పితృదేవతలు తరిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి, విజయాలు అందుకుంటారు.
10/12
అలాగే ఆదివారం, శివరాత్రి కూడా కలిసి రావడం వల్ల శత్రుపీడ, గ్రహ బాధలు తొలగిపోతాయంటారు.
11/12
ఈ రోజు ఓం నమ: శివాయ మంత్ర జపం, రుద్రాభిషేకం, బిల్వార్చన చేయాలని చెబుతారు.
12/12
ఈ రోజు.. దానం చేయడం వల్ల పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని పేర్కొంటారు.
Updated at - Feb 15 , 2026 | 11:07 AM