రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Feb 03 , 2026 | 07:22 AM
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా ‘రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార’ ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అలాగే వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
1/9
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా ‘రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార’ ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
2/9
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అలాగే వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానం చేశారు.
3/9
రావి నారాయణ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం నిలబడే ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
4/9
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
5/9
ఈ కార్యక్రమం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ప్రజల్లోకి వెళ్లిందని వక్తలు తెలిపారు. త్యాగం, పోరాటం, రాజ్యాంగ నిబద్ధత ఇవే దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలు అని వక్తలు పేర్కొన్నారు.
6/9
రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయడం ద్వారా, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యత మరోసారి ప్రజల్లోకి వెళ్లిందని వక్తలు వ్యాఖ్యానించారు.
7/9
ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమ చరిత్రకు, ప్రజాస్వామ్య పోరాటాలకు ఒక గౌరవప్రదమైన గుర్తుగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు.
8/9
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.
9/9
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీ పాలనకు ఎదురు నిలిచి, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన విప్లవకారుడిగా ఆయన చరిత్రలో నిలిచారని వక్తలు పేర్కొన్నారు.
Updated at - Feb 03 , 2026 | 07:38 AM