డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో మెగా సైకిల్ ర్యాలీ.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
ABN, Publish Date - Nov 29 , 2026 | 12:45 PM
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశంతో హైదరాబాద్‌లో మెగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
1/7
‘డ్రగ్స్ వద్దు- జీవితమే ముద్దు’ నినాదంతో ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన ‘మెగా సైకిల్ ఫర్ రైడ్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు.
2/7
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ‘డ్రగ్స్‌ను వ్యతిరేకిస్తున్నాం’ అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
3/7
యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి, వ్యసన రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు.. రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ముఖ్య నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
4/7
‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ నినాదంతో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సైకిల్ రైడ్ కార్యక్రమాన్ని అభినందిస్తూ.. గవర్నర్ శివప్రతాప్ శుక్లా పలువురికి జ్ఞాపికలను అందజేశారు.
5/7
హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన ‘మెగా సైకిల్ ఫర్ రైడ్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. జెండా ఊపి సైకిల్ రైడ్‌ను ప్రారంభించారు.
6/7
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సే నో టు డ్రగ్స్.. సే ఎస్ టు లైఫ్’ అంటూ నినాదాలు చేస్తూ సైకిలర్స్‌ను ఉత్సాహపరచారు.
7/7
మాదకద్రవ్యాలకు వ్యతిరేకం యువతలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సైకిల్ రైడ్‌లో యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Updated at - Nov 29 , 2026 | 12:47 PM