హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026..

ABN, Publish Date - Oct 11 , 2026 | 04:43 PM

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ - 2026 కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా జరిగింది.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 1/6

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ - 2026 కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా జరిగింది.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 2/6

క్యాన్సర్‌పై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, నిరుపేదలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందించేందుకు సహకారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 3/6

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్‌లో ప్రజలు, యువత, క్రీడాభిమానులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 4/6

ఈ ఏడాది రన్‌ను ‘రన్ ఫర్ గ్రేస్ - స్క్రీన్ ఫర్ లైప్’ అనే నినాదంతో నిర్వహించారు. ఈ సందర్భంగా 2కే,5కే, 10కే విభాగాలను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 5/6

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగుపడే అవకాశం ఉంటుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.

హైదరాబాద్‌లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2026.. 6/6

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated at - Oct 11 , 2026 | 04:49 PM