సెలబ్రేట్ ది స్కై వేడుకలకు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
ABN, Publish Date - Jan 13 , 2026 | 11:50 AM
ఈ సంక్రాంతికి భాగ్యనగరం రంగురంగుల గాలిపటాలతో, ధగధగలాడే డ్రోన్లతో, ముచ్చటగొలిపే హాట్ ఎయిర్ బెలూన్లతో నిండిపోనుంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సెలబ్రేట్ ది స్కై వేడుకలు జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి జూపల్లి, పర్యాటక శాఖ అధికారులు కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
1/6
ఈ సంక్రాంతికి భాగ్యనగరం రంగురంగుల గాలిపటాలతో, ధగధగలాడే డ్రోన్లతో, ముచ్చటగొలిపే హాట్ ఎయిర్ బెలూన్లతో నిండిపోనుంది.
2/6
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సెలబ్రేట్ ది స్కై వేడుకలు జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
3/6
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి జూపల్లి, పర్యాటక శాఖ అధికారులు కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
4/6
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సెలబ్రేట్ ది స్కై వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త కళను తీసుకువస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారు.
5/6
సాంప్రదాయ సంక్రాంతి వేడుకలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, ఆకాశాన్ని వేదికగా చేసుకున్న ఈ వినూత్న కార్యక్రమం పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
6/6
సెలబ్రేట్ ది స్కై కార్యక్రమం కేవలం వినోదం పంచడం మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.
Updated at - Jan 13 , 2026 | 02:19 PM