శత వసంతాలు పూర్తి చేసుకున్న చుక్కా రామయ్య.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Nov 20 , 2026 | 03:54 PM
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
1/6
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
2/6
శుక్రవారం విద్యానగర్‌లోని ఐఐటీ రామయ్య నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పుష్పగుచ్చం అందజేసి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
3/6
విద్యాబోధనలో తనదైన శైలిలో యువత భవిష్యత్తుకు ఆయన బంగారు బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
4/6
విద్యారంగానికి మార్గదర్శకంగా నిలవడమే కాకుండా.. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
5/6
చుక్కా రామయ్య ఆశీర్వాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు.
6/6
చుక్కా రామయ్యకు జన్మదినం చెప్పిన వారిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ. హరగోపాల్, ఎడిటర్ కె. రామచంద్రమూర్తి, ఎమ్మెల్సీ కోదండరాం ఉన్నారు.
Updated at - Nov 20 , 2026 | 04:08 PM