పాలమూరు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప్ సమ్మేళనం
ABN, Publish Date - Feb 04 , 2026 | 07:47 PM
మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విజయ సంకల్ప్ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
1/7
మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విజయ సంకల్ప్ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
2/7
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
3/7
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ మాట్లాడుతూ.. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
4/7
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
5/7
తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్రంలో రైల్వేకు రూ.5,400 కోట్లకుపైగా కేటాయించిందని నబిన్ చెప్పుకొచ్చారు. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు కేటాయించిందని తెలిపారు.
6/7
కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత పెడుతోందని ఆయన ఆరోపించారు.
7/7
వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోందని, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపట్లేదంటూ నితిన్ నబిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Feb 04 , 2026 | 08:29 PM