డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల వ్యూహం.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ
ABN, Publish Date - Nov 28 , 2026 | 01:07 PM
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సమావేశమయ్యారు. శనివారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరయ్యారు.
1/7
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు అడ్డుకునేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సమావేశమయ్యారు.
2/7
శనివారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరయ్యారు.
3/7
ఈ సమావేశానికి లోక్‌సభలో ప్రతపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు ఎంపీ ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
4/7
మంతనాలు జరుపుతున్న రాహుల్, ఖర్గే
5/7
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందేందుకు ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
6/7
శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఈ రెండు బిల్లులను క్యాబినేట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం కోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కసరత్తు చేస్తోంది.
7/7
ఈ నేపథ్యంలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమై.. చర్చిస్తున్నారు. ఈ భేటీకి ఇండియా కూటమిలో లేని ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా ఆహ్వానించారు.
Updated at - Nov 28 , 2026 | 01:26 PM