కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు

ABN, Publish Date - Jun 04 , 2026 | 07:21 AM

‘డీకే శివకుమార్‌ అనే నేను..’ అంటూ.. కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా దొడ్డ ఆలనహళ్లి కెంపేగౌడ(డీకే) శివకుమార్‌ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం సాయంత్రం 3.50 గంటలకు డీకే లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అభిమానులు, తాజా మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 1/25

‘డీకే శివకుమార్‌ అనే నేను..’ అంటూ.. కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా దొడ్డ ఆలనహళ్లి కెంపేగౌడ(డీకే) శివకుమార్‌ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 2/25

బెంగళూరులోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 3/25

బుధవారం సాయంత్రం 3.50 గంటలకు డీకే లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అభిమానులు, తాజా మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగాన్ని పట్టుకుని.. ‘డీకే శివకుమార్‌ అను నేను..’ అంటూ వీరగంగాధర అజ్జయ్య పేరిట ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్‌ థావర్‌ చంద్‌.. డీకేతో ప్రమాణం చేయించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 4/25

వేదికపైకి చేరుకున్న ఆయన, తాను నమ్మిన నొణవినకెరె కాడుసిద్దేశ్వర మఠాధిపతి వీరగంగాధర అజ్జయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 5/25

కాంగ్రెస్ కార్యాలయం తమకు ఒక దేవాలయం లాంటిదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయినవారు కాంగ్రెస్ కార్యాలయాన్ని విడిచిపెట్టరని తెలిపారు. కార్యకర్తలే తన ప్రాణమని.. తాను విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించానని ప్రస్తావించారు. ఒక కార్యకర్తకు ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నిర్వహణలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 6/25

ముఖ్యమంత్రి కుర్చీ తనది కాదని, అది కోట్లాదిమంది కర్ణాటక ప్రజలదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 7/25

డీకే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్‌విందర్‌సింగ్‌ సుఖు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహ్మద్‌ అజ్జారుద్దీన్‌ హాజరయ్యారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 8/25

సినిమా రంగానికి చెందిన ‘నెనపిరలి’ ఫేమ్‌ ప్రేమ్‌ కుటుంబ సభ్యులు, మాజీ నటి, మాజీ ఎంపీ రమ్య, క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే సహా పలువురు పాల్గొన్నారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 9/25

సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయానికి ప్రతీకలైన ఈ మహనీయుల మార్గాన్ని అనుసరిస్తూ, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమాన్ని సాధించడానికి తమ ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 10/25

డీకే శివకుమార్‌ స్వగ్రామం దొడ్డ ఆలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మహిళా కార్మికులు, ప్రజాసంఘాల ముఖ్యులు హాజరయ్యారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 11/25

డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రముఖ మఠాల స్వామిజీలు సుమారు 40 మందికిపైగా వచ్చారు. ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 12/25

విధాన సౌధ ప్రాంగణంలో ఉన్న మహానీయులను డీకే శివకుమార్ స్మరించుకున్నారు. జగద్గురు బసవన్న, నాడప్రభు కెంపెగౌడ, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 13/25

బెంగళూరులోని పలు ప్రాంతాలు, రాష్ట్రంలోని 230 ఆర్టీసీ బస్టాండ్‌లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 14/25

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 15/25

డీకే శివకుమార్‌కు సోనియాగాంధీ ఫోన్‌ చేసి అభినందించారు. అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజాపాలనను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని ఆమె సూచించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 16/25

ప్రజల చేత, ప్రజల కోసం. ఈ రోజు, అపారమైన వినయంతో, కృతజ్ఞతా హృదయంతో లోక్‌భవన్‌లో తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 17/25

ఢిల్లీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా వచ్చారు. తాజా మాజీ సీఎం సిద్దరామయ్య, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభు భక్రు, పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి, మాజీ సీఎం వీరప్పమొయిలీ సహా పలువురు పాల్గొన్నారు. సీఎం డీకే శివకుమార్‌, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 18/25

ఈ క్షణం కేవలం తనది మాత్రమే కాదని, కర్ణాటక ప్రజలదని, లక్షలాది అంకితభావం గల కాంగ్రెస్ కార్యకర్తలదని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 19/25

కర్ణాటక ప్రజల ఆప్యాయత, నమ్మకం, అచంచలమైన విశ్వాసం తన ప్రయాణంలోని ప్రతి సవాలులో, ప్రతి మైలురాయిలో తనకు మార్గనిర్దేశం చేశాయని డీకే శివకుమార్ తెలిపారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 20/25

ప్రమాణస్వీకారం ముగిశాక తేనీటి విందు సమయంలో సీఎం డీకే శివకుమార్‌ భార్య ఉష, కూతురు ఐశ్వర్య, కుమారుడు ఆకాశ్‌.. తాజా మాజీ సీఎం సిద్దరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 21/25

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీని స్వాగతించేందుకు డీకే స్వయంగా వెళ్లారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 22/25

తన తల్లి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుంటున్న డీకే శివకుమార్.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 23/25

తన తల్లితో అప్యాయంగా మాట్లాడుతున్న డీకే శివకుమార్.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 24/25

జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు.

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌.. హాజరైన ప్రముఖులు 25/25

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందే డీకే శివకుమార్‌ బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

Updated at - Jun 04 , 2026 | 07:43 AM