వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక

ABN, Publish Date - Nov 12 , 2026 | 06:41 AM

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యామారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్‌లో నవంబరు 11వ తేదీన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 1/6

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యామారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్‌లో నవంబరు 11వ తేదీన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 2/6

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్, ఆయన సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య, అనిరుధ్‌ తల్లిదండ్రులు లక్ష్మి, రవిచందర్, కావ్య తల్లిదండ్రులు కళానిధిమారన్, కావేరి, పలువురు తమిళ సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 3/6

వివాహానికి సంబంధించిన ఫొటోలను అనిరుధ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం.. జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. 11.11’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించారు.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 4/6

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 5/6

అనిరుధ్‌, కావ్యా మారన్‌ వివాహ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వైభవంగా అనిరుధ్‌, కావ్యామారన్‌ వివాహ వేడుక 6/6

నవంబరు 21వ తేదీన చెన్నైలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు కూడా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Updated at - Nov 12 , 2026 | 07:24 AM