హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్

ABN, Publish Date - Jul 07 , 2026 | 08:53 PM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సందర్శించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 1/11

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సందర్శించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 2/11

ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ట్రస్టు సభ్యులు నారా బ్రాహ్మణి, జేఎస్ఆర్ ప్రసాద్‌లు సంజయ్ దత్‌కు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 3/11

అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నందమూరి తారకరామారావు దంపతుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 4/11

ఆస్పత్రిలో కీలక విభాగాలను, చిన్న పిల్లల వార్డును సందర్శించి వైద్యులు, రోగులతో ముచ్చటించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 5/11

ఈ సందర్భంగా రోగులకు పళ్లు, చిన్నారులకు బహుమతులు అందజేశారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 6/11

క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిపై పోరాటానికి మనో ధైర్యం కావాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 7/11

తన తల్లి క్యాన్సర్‌తో చని పోయిందని, కొన్నేళ్ల క్రితం తానూ లంగ్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నానని సంజయ్ దత్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 8/11

క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, ముందస్తు పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందితే పూర్తిగా నయమవుతుందని సంజయ్ దత్‌ ధైర్యం చెప్పారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 9/11

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న కారణాలు, ఆశయాలు, లక్ష్యాలను నందమూరి బాలకృష్ణ వివరించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 10/11

తన తల్లి పేరుతో నిర్మించిన ఈ వైద్యశాలను దేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎందరో క్యాన్సర్ రోగులకు స్వాంతన అందిస్తున్నామని గణాంకాలతో సహా నందమూరి బాలకృష్ణ ప్రస్తావించారు.

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన సంజయ్ దత్ 11/11

భవిష్యత్తులో అత్యాధునిక డయాగ్నొస్టిక్ పరికరాలు, రేడియేషన్, రోబో టిక్ ఆపరేషన్ సిస్టం లాంటి ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాబరేటరీలను అందుబాటులోకి తెచ్చి, ప్రపంచ స్థాయి అత్యున్నత శ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated at - Jul 07 , 2026 | 08:55 PM