కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 23 , 2026 | 10:10 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కించుకుని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 1/8

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 2/8

యాదాద్రి నారసింహుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 3/8

నిన్న(ఆదివారం) సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ పరిసరాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 4/8

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు విశేషంగా చేపట్టారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 5/8

భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో కుటుంబసమేతంగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాల్లో సందడిగా మారాయి.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 6/8

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 7/8

కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయ సమీపంలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి.

కార్తీకమాసం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 8/8

కార్తీక మాసం, శుభకార్యాల సందర్భంగా యాదాద్రికి వచ్చిన భక్తులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో బిబినగర్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వరంగల్-హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య రెట్టింపు అయింది.

Updated at - Nov 23 , 2026 | 10:20 AM