హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక
ABN, Publish Date - Oct 19 , 2026 | 08:05 AM
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్‌బండ్ వేదికగా సద్దుల బతుకమ్మ సంబరాలను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు భాగ్యనగరంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల సంప్రదాయ ఆటపాటలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో, బాణసంచా వెలుగులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు అద్భుతంగా ముస్తాబయ్యాయి. నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ వైభవాన్ని ఆస్వాదించారు.
1/20
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్‌బండ్ వేదికగా సద్దుల బతుకమ్మ సంబరాలను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
2/20
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు భాగ్యనగరంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.
3/20
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల సంప్రదాయ ఆటపాటలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో, బాణసంచా వెలుగులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు అద్భుతంగా ముస్తాబయ్యాయి.
4/20
నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ వైభవాన్ని ఆస్వాదించారు.
5/20
వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.
6/20
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.
7/20
ఈ సద్దుల బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణి జానకి, మంత్రి సీతక్క పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. ప్రముఖుల రాకతో ట్యాంక్‌బండ్ వద్ద సందడి మరింత పెరిగింది.
8/20
తెలంగాణ పూల పండుగలో ప్రముఖులు భాగస్వాములు కావడంతో నగరవాసుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
9/20
వివిధ వేదికలపై కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
10/20
సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, సంగీత ప్రదర్శనలతో వేడుకలు కళకళలాడాయి.
11/20
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందించడానికి వేదికగా నిలిచాయి.
12/20
తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
13/20
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యం ఉందని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.
14/20
ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచిందని చెప్పారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రజల మధ్య సోదరభావాన్ని, కుటుంబ అనుబంధాలను, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేశాయని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
15/20
పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు, మహిళల ఉత్సాహం, సంప్రదాయబద్ధమైన వేడుకలు పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి.
16/20
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పలువురు తెలిపారు. పూల సోయగాలు, జానపద గీతాలు, ప్రముఖుల సందడి, లేజర్ షోల మధ్య సాగిన ఈ సంబరాలు నగరవాసులకు ఎప్పటికీ మరపురాని మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాయి.
17/20
బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి సంప్రదాయ బద్ధంగా ఆడిపాడారు. ట్యాంక్‌బండ్ పరిసరాలు తీరొక్క పూలతో పూలవనాన్ని తలపించాయి.
18/20
అనంతరం నిర్వహించిన లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు ఆకాశాన్ని రంగులమయం చేశాయి. హుస్సేన్ సాగర్ తీరంలోని ఈ దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
19/20
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని పలువురు ఆకాంక్షించారు.
20/20
నగరవాసులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని నలుదిశలా చాటిచెప్పారు.
Updated at - Oct 19 , 2026 | 08:49 AM