వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Sep 21 , 2026 | 09:25 PM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలపై స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
1/15
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
2/15
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలపై స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
3/15
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమాడ వీధుల్లో దేశ, విదేశాలకు చెందిన కళాకారులు తమ అద్భుతమైన నృత్య, జానపద, శాస్త్రీయ కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశారు.
4/15
బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలు ఇచ్చాయి.
5/15
భక్తి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలను తిరుమలలోని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
6/15
తిరుమల బ్రహ్మోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రపంచానికి చాటే వేదికగా నిలిచాయి
7/15
జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలతో తిరుమాడ వీధులు కళామయంగా మారాయి.
8/15
కళాకారుల నృత్యాలు, వాయిద్య ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
9/15
తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో జోరుగా వర్షం కురిసింది.
10/15
ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి స్నపన తిరుమంజనం కోసం ప్రత్యేక పూలమాలలు, కిరీటాలను సిద్ధం చేశారు.
11/15
శ్రీవారి సేవల కోసం ప్రత్యేకంగా అలంకరణలు, పుష్ప ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
12/15
వర్షం మధ్య చంద్రప్రభ వాహన సేవ కొనసాగగా, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
13/15
భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమాడ వీధులు పొగమంచుతో కప్పుకున్న దృశ్యాలు కనిపించాయి.
14/15
వర్షం, చలిని లెక్కచేయకుండా భక్తులు శ్రీవారి వాహన సేవను దర్శించేందుకు వేచి ఉన్నారు.
15/15
బ్రహ్మోత్సవాల ప్రతి వాహన సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Updated at - Sep 21 , 2026 | 09:40 PM