కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 24 , 2026 | 12:47 PM

పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీతో ఆలయాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 1/6

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ దీపకాంతులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో ఆలయాలకు చేరుకుని భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. దీంతో ఆలయాల ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 2/6

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని గోపాల కృష్ణమఠాన్ని దీపాలతో అలంకరించారు. రాధాకృష్ణులకు దీపోత్సవం, కాగడ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 3/6

వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 4/6

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేసింది.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 5/6

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నగర పరిధిలోని మంచిరేవుల శివాలయం, పుప్పాలగూడ శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీకపౌర్ణమి పర్వదినాన అభిషేక ప్రియుడికి ప్రత్యేకపూజలు.. పోటెత్తిన భక్తులు 6/6

పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ శివనామస్మరణలతో మార్మోగాయి.

Updated at - Nov 24 , 2026 | 12:52 PM