మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు

ABN, Publish Date - Nov 11 , 2026 | 08:39 AM

సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 1/18

సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 2/18

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 3/18

ఈ సందర్భంగా మాతా అమృతమయి పీఠం 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 4/18

పీఠం ఆధ్వర్యంలో చేపడుతున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 5/18

కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా మఠం అందిస్తున్న నిస్వార్థ సేవలు సమాజంలో ఎంతో మార్పును తీసుకొస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మానవత్వం, కరుణ, సేవాభావానికి నిజమైన ప్రతిరూపాలని వ్యాఖ్యానించారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 6/18

ఈరోజు సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో మాతా అమృతానందమయి మఠం 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 7/18

అమ్మగా ప్రసిద్ధి చెందిన మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు అందుకోవడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 8/18

గత 25 ఏళ్లుగా మాతా అమృతమయి మఠం హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 9/18

ముఖ్యంగా పేదలకు వైద్య సేవలు అందించడం, మహిళా సాధికారతకు ప్రోత్సాహం కల్పించడం, విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడం, ఉపాధి అవకాశాల ద్వారా యువత స్వయం సమృద్ధి సాధించేలా చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 10/18

కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో మఠం సేవలు అందిస్తోంది.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 11/18

ఈ సందర్భంగా మఠం అందిస్తున్న నిస్వార్థ సేవలను ప్రముఖులు అభినందించారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 12/18

సమాజంలో సేవాభావం, మానవత్వం, కరుణ వంటి విలువలను పెంపొందించడంలో ఇలాంటి సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 13/18

మాతా అమృతానందమయి ఆశీస్సులతో మఠం మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ పేదలు, విద్యార్థులు, మహిళలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 14/18

ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, మఠం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 15/18

ఈ పవిత్రమైన సందర్భంగా శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ) ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 16/18

హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మాతా అమృతానందమయి మఠం గత 25 ఏళ్లుగా సేవలను అందిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమృతానందమయి సంస్థ సేవలను అభినందించారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 17/18

అమ్మ బోధనల స్ఫూర్తితో పేదలకు వైద్య సేవలు అందించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం, విద్యార్థులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా చేయడం వంటి కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

మాతా అమృతమయి పీఠం 25వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు 18/18

అమ్మ దివ్య ఆశీస్సులు సమాజానికి నిరంతరం మార్గనిర్దేశం చేయాలని, మరింత మందికి ఆశలు, అవకాశాలు కల్పించేలా మఠం తన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

Updated at - Nov 11 , 2026 | 08:53 AM