నాగులచవితి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 13 , 2026 | 09:51 PM
నాగులచవితిని పురస్కరించుకుని ఈ రోజు (శుక్రవారం) దేవాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు.. తమ సమీప దేవాలయాల్లోని పుట్టల వద్దకు చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
1/6
నాగులచవితిని పురస్కరించుకుని ఈ రోజు (శుక్రవారం) దేవాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు.. తమ సమీప దేవాలయాల్లోని పుట్టల వద్దకు చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
2/6
ఈ రోజు నాగులచవితి సందర్భంగా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కర్మాన్‌ఘాట్ దేవాలయంలోని పుట్ట వద్ద.. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు పూజలు ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పుట్ట వద్దకు చేరి.. నాగేంద్రునికి పాలు సమర్పించారు.
3/6
నాగుల చవితిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో దంపతులు నాగదేవతలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. తమ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలంటూ.. వేడుకున్నారు. ఈ రోజు నాగేంద్రునికి పూజలు చేసిన దంపతుల మధ్య కలహాలకు చోటు ఉండదని.. ఎల్లవేళలా కలిసిమెలిసి ఉంటారని భక్తుల విశ్వాసం.
4/6
దీపావళి అమావాస్య తరువాత కార్తీక మాసంలోని నాలుగవ రోజైన కార్తీక శుద్ధ చవితిని పురస్కరించుకుని.. మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు విశేష పూజలు చేశారు. సంతానం లేనివాళ్లు ఈ రోజు పుట్టలో పాలు పోసి, నాగదేవతలు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తే.. పిల్లలు కలుగుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.
5/6
మూసారాంబాగ్‌లోని పుట్ట వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో చేరి.. పుట్టలో పాలు పోశారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి.. పసుపు, కుంకుమలు సమర్పించారు. రంగురంగుల పూలతో పూజలు చేసిన అనంతరం చలిమిడి నైవేద్యాలను సమర్పించి.. నాగేంద్రుని కృప తమపై ఉండాలని వేడుకున్నారు.
6/6
చందానగర్‌లోని ఓ దేవాలయంలో గల పుట్టకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు పుట్టను పసుపుకుంకుమలతో అలంకరించి.. భక్తిశ్రద్ధలతో నైవేధ్యాలు సమర్పించారు. ఎంతో శ్రద్ధగా దీపారాధన చేశారు.
Updated at - Nov 13 , 2026 | 09:52 PM