పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం

ABN, Publish Date - May 31 , 2026 | 03:32 PM

యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతోపాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో.. యాదాద్రికి భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేదాద్రికి భక్తులు తరలి వచ్చారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 1/9

యాదాద్రిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 2/9

ఆదివారం సెలవు దినం కావడంతోపాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో.. యాదాద్రికి భక్తులు క్యూ కట్టారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 3/9

హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేదాద్రికి భక్తులు తరలి వచ్చారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 4/9

దీంతో స్వామి వారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 5/9

ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరణి తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 6/9

భక్తుల తాడికితో స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 7/9

యాదాద్రి కొండపై వాహనాల పార్కింగ్ నిండిపోయింది. దీంతో వాహనదారులు కొండమీదకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 8/9

వాహనాలను కొండ కింద పార్క్ చేసి వెళ్తామన్నా.. సరిపడా బస్సులు లేక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దేవాలయం 9/9

కనీసం సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో బస్సులు పెంచాలని దేవస్థానం అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Updated at - May 31 , 2026 | 03:42 PM