గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - May 12 , 2026 | 02:39 PM

తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం (12-05-2026).. ఈ జాతర చివరి రోజు. దీంతో అమ్మ వారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 1/12

తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం (12-05-2026).. ఈ జాతర చివరి రోజు. దీంతో అమ్మ వారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 2/12

ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 3/12

ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పొయ్యిలపై పొంగలి వండి.. అమ్మవారికి నైవేద్యంగా భక్తులు సమర్పించారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 4/12

అలాగే అమ్మవారికి చీర సారెలు మొక్కుల రూపంలో సమర్పించారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 5/12

ఈ రోజు అమ్మవారిని దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 6/12

ప్రతి ఏటా వైశాఖ మాసం చివరి వారంలో గంగమ్మ జాతర జరుగుతుంది.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 7/12

ఈ ఏడాది మే 5వ తేదీన ఈ జాతర ప్రారంభమైంది.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 8/12

రోజుకో వేషంతో భక్తుల విచిత్ర అలంకరణలతో గంగమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 9/12

మే 6వ తేదీ బైరాగి వేషంతో ప్రారంభమై.. బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషంతో ఈ జాతర కొనసాగింది.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 10/12

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తాతయ్య గుంటలోని గంగమ్మ స్వయానా సోదరిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి టీటీడీ సారె సమర్పించింది.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 11/12

పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

గంగమ్మ జాతర.. చివరి రోజు పోటెత్తిన భక్తులు 12/12

చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అంతా గంగమ్మను దర్శించుకున్నారు.

Updated at - May 13 , 2026 | 07:01 AM