శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
ABN, Publish Date - Sep 29 , 2026 | 01:15 PM
తిరుమలేశుడిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) ఉదయం దర్శించుకున్నారు.
1/9
తిరుమలేశుడిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) ఉదయం దర్శించుకున్నారు.
2/9
సింగపూర్ హోం మంత్రి కే.షణ్ముగంతో కలిసి వేంకటేశ్వరస్వామికి లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు.
3/9
శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న (సోమవారం) రాత్రి తిరుమల చేరుకున్న షణ్ముగంకు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు.
4/9
అనంతరం ఇవాళ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగాన్ని శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు.
5/9
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు.
6/9
అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
7/9
అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
8/9
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్.
9/9
తిరుమలకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న టీటీడీ అధికారులు.
Updated at - Sep 29 , 2026 | 01:25 PM