తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ

ABN, Publish Date - Jun 29 , 2026 | 09:44 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 1/8

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 2/8

ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 3/8

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి సత్కరించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 4/8

తిరుమల పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించడం విశేషంగా నిలిచింది.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 5/8

తిరుమల రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇస్తామని అనంత్ అంబానీ చెప్పారు. బస్సు డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని టీటీడీకి వివరించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 6/8

గుజరాత్‌ వంతారాలో ఉన్నట్లుగా టీటీడీ గోశాలను ఆధునికీకరించడానికి ఆయన అంగీకరించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజలు చేసిన అనంత్ అంబానీ, దేశ ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 7/8

ఈ సందర్భంగా తిరుమలకు వచ్చిన భక్తులు అనంత్ అంబానీని చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన పర్యటన ప్రశాంతంగా సాగింది.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంత్ అంబానీ 8/8

శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అనంత్ అంబానీతో కాసేపు సమావేశమై టీటీడీ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలుస్తోంది.

Updated at - Jun 29 , 2026 | 09:46 AM