తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు..

ABN, Publish Date - Jul 06 , 2026 | 02:43 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పట్ల భక్తులకున్న విశ్వాసానికి నిదర్శనంగా 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ నిలిచారు. తమిళనాడుకు చెందిన ఈ వృద్ధురాలు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని భక్తులను, టీటీడీ అధికారులను ఆశ్చర్యపరిచారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 1/7

తిరుమల వేంకటేశ్వరస్వామివారి పట్ల భక్తులకున్న విశ్వాసానికి నిదర్శనంగా 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ నిలిచారు. తమిళనాడుకు చెందిన ఈ వృద్ధురాలు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని భక్తులను, టీటీడీ అధికారులను ఆశ్చర్యపరిచారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 2/7

వయస్సు పైబడినప్పటికీ స్వామి వారిపై ఆమె చూపిన భక్తి, పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. శనివారం ఆమె అలిపిరి మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 3/7

నవనీతమ్మ భక్తిని గౌరవిస్తూ సోమవారం ఉదయం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 4/7

116 ఏళ్ల వయస్సులోనూ తిరుమల కొండను కాలినడకన వచ్చిన నవనీతమ్మ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 5/7

ఆమె అచంచల భక్తి, సంకల్పబలం లక్షలాది మంది భక్తులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 6/7

శ్రీవారి పట్ల ఉన్న నిజమైన భక్తికి వయస్సు అడ్డుకాదని నవనీతమ్మ మరోసారి నిరూపించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు.. 7/7

తమిళనాడుకు చెందిన నవనీతమ్మ, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉంటున్నారు.

Updated at - Jul 06 , 2026 | 02:48 PM