టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ABN, Publish Date - Sep 08 , 2026 | 09:32 PM

తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ ఈరోజు (మంగళవారం) రెండో రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 1/15

తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ ఈరోజు (మంగళవారం) రెండో రోజు నిర్వహించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 2/15

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 3/15

రెండో రోజు కాంక్లేవ్‌లో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 4/15

సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవలు, సుపరిపాలన, పొలిటికల్ కమ్యూనికేషన్, ఎల్‌నినోపై అవగాహన, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై టీడీపీ నేతలకు.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 5/15

మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకూ టీడీపీ కార్యాలయంలోనే చంద్రబాబు ఉన్నారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 6/15

రాష్ట్ర స్థూల అభివృద్ధితో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 7/15

నియోజకవర్గ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు ముందు ఉన్నాయని సీఎం వివరించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 8/15

అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా వారి వద్దకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేసే అలవాటు లేని వారిని కూడా మార్చుకుందామని నిర్దేశించారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని సీఎం పేర్కొన్నారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 9/15

మనం చేస్తున్న అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందామని మంత్రి నారా లోకేశ్ సూచించారు. మన దగ్గరకు గూగుల్ వస్తే భారత్‌లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయని తెలిపారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 10/15

ఏపీలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రి లోకేశ్ విమర్శించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 11/15

డేటా సెంటర్లకు కావాల్సిన 5 టీఎంసీల నీరు అసలు సమస్యే కాదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 12/15

డేటా సెంటర్ల ద్వారా అధికమొత్తంలో ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 13/15

2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 14/15

15-20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్.. పసుపు తమ్ముళ్లకు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 15/15

రూ.30 వేల కోట్ల పెట్టుబడులను తాము ఆకర్షించామని మంత్రి లోకేశ్ తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

Updated at - Sep 08 , 2026 | 09:59 PM