నటుడు రానాతో మంత్రి లోకేశ్ స్పెషల్ లైవ్ పాడ్‌కాస్ట్
ABN, Publish Date - Nov 14 , 2026 | 01:01 PM
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘ది పవర్ ఆఫ్ పాజిబిలిటీ: బిల్డింగ్ పార్టనర్‌షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి శుక్రవారం నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.
1/9
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘ది పవర్ ఆఫ్ పాజిబిలిటీ: బిల్డింగ్ పార్టనర్‌షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి శుక్రవారం నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.
2/9
సినిమా పరిశ్రమ ఏపీలోనూ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? అని నటుడు రానా ప్రశ్నించగా... మంత్రి లోకేశ్ స్పందించారు. క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.
3/9
సినిమాలు, యూట్యూబ్, గేమింగ్ అన్నీ ఇందులో భాగమేనని వివరించారు. తన కుమారుడు దేవాన్ష్‌కు కూడా సొంత యూట్యూబ్ చానెల్ ఉందని లోకేశ్ చెప్పుకొచ్చారు.
4/9
విశాఖలో సినిమా పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీ(సీఈ) అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
5/9
ఏపీలోని పిల్లలు, కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి సృజనాత్మకత ఉందని చెప్పారు. చేతిలో ఉన్న ఫోన్‌తోనే వీడియోలు రూపొందించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉందని లోకేశ్ తెలిపారు.
6/9
సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు.
7/9
అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్... ప్రభుత్వం నుంచి సహకారం, పరిశ్రమ నుంచి చొరవ ఉంటే విశాఖలోనూ సినిమా పరిశ్రమకు మంచి అవకాశాలు సృష్టించవచ్చునని రానా పేర్కొనగా... లోకేశ్ స్పందిస్తూ... ‘మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. సినిమా, గేమింగ్ రంగాల్లో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఏపీలో క్రియేటర్లకు అవసరమైన సదుపాయాలపై ఉమ్మడి ప్రణాళిక రూపొందిద్దాం’ అని ప్రతిపాదించారు.
8/9
ఇందుకు రానా స్పందిస్తూ... ‘విశాఖలో సినిమా రంగంతోపాటు ఇతర క్రియేటివ్ రంగాల వారికీ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో కలసి పనిచేస్తా. దీనిపై బ్లూఫ్రింట్‌ను సోమవారం ఉదయానికి సిద్ధం చేస్తా’ అని ప్రకటించారు.
9/9
‘అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని లోకేశ్ చమత్కరించారు. ‘రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉంది. విశాఖను దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అరకు లోయలో మారథాన్ నిర్వహణకు మహీంద్ర సంస్థతో చర్చలు జరుపుతున్నాం. పెట్టుబడుల ఒప్పందాలు, ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యమైతే.. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే మా ప్రధాన ధ్యేయం’ అని లోకేశ్ అన్నారు.
Updated at - Nov 14 , 2026 | 01:07 PM