ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు
ABN, Publish Date - Oct 04 , 2026 | 09:33 PM
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం పర్యటించారు. పీఎంఏవై గ్రామీణ్ 2.0లో భాగంగా ఏపీ వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారధి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
1/10
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం పర్యటించారు.
2/10
పీఎంఏవై గ్రామీణ్ 2.0లో భాగంగా ఏపీ వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
3/10
అనంతరం గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
4/10
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారధి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
5/10
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
6/10
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి కేంద్రమంత్రి వచ్చారు.
7/10
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
8/10
బుర్రిపాలెంలో సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.
9/10
బుర్రిపాలెంలో జానకీరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
10/10
ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న రైతు జానకీ రామ్‌ను భుజం తట్టి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభినందించారు.
Updated at - Oct 04 , 2026 | 09:48 PM