గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 29 , 2026 | 03:05 PM

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. లోకేశ్‌తోపాటు పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 1/14

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 2/14

బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 3/14

అంతకు ముందు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 4/14

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపచుట్టేస్తున్నాయన్నారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 5/14

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే జెండా.. పసుపు జెండా అని ఏపీ సీఎం అభివర్ణించారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 6/14

44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశామని గుర్తు చేశారు. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదని చెప్పారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 7/14

2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా అధికంగా రావాలని పార్టీ కేడర్‌కు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 8/14

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నట్లు వివరించారు. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్త వారికి అవకాశం ఇచ్చామన్నారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 9/14

కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 10/14

సీనియారిటీ, సిన్సియారిటీతో దాదాపు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 11/14

మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్‌ఛార్జిని పొలిట్ బ్యూరో సభ్యులుగా చేశామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 12/14

252 మందితో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 13/14

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే పసుపు జెండా: సీఎం చంద్రబాబు 14/14

పార్టీ నాయకులు, కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది.

Updated at - Apr 29 , 2026 | 03:55 PM