మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి లోకేశ్
ABN, Publish Date - Jan 20 , 2026 | 07:30 AM
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగుజాతి గర్వపడేలా పని చేద్దామని ఎన్నారైలకు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఈ సందర్భంగా వారిని అభివర్ణించారు.
1/13
ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయన నాయకత్వంలో మా యంగ్ టీమ్ పని చేస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబు తమకు జీపీఎస్ అని అభివర్ణించారు. జ్యూరిక్‌లో యూరప్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు.
2/13
చంద్రబాబు నాయకత్వంలో తామంతా ఎలాంటి ఈగోలు లేకుండా పని చేస్తున్నామన్నారు.
3/13
తాను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే.. టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారని పేర్కొన్నారు.
4/13
పెట్టుబడులు తెచ్చేందుకు తాము పోటీ పడుతున్నామని చెప్పారు. పని విషయంలో కేబినెట్‌లో సహచరుల మధ్య పోటీ వాతావరణం ఉందన్నారు.
5/13
గత ఎన్నికల్లో ఏ ఆశయాలతో ప్రజలు మమ్మల్ని గెలిపించారో వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇది మన ప్రభుత్వమని స్పష్టం చేశారు.
6/13
పది నిర్ణయాల్లో మూడు తప్పులు ఉంటాయని.. వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మీపై.. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పవనన్న చెప్పినట్లు ఈ ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు ఉండాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
7/13
సముద్రాలు దాటినా మీరు సంప్రదాయాలు మర్చిపోలేదన్నారు. తెలుగును తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్నారని ఎన్నార్టీలపై ప్రశంసల జల్లు కురిపించారు.
8/13
జ్యూరిక్‌లో తెలుగు వారి జోష్ అదిరిపోయిందని పేర్కొన్నారు. యూరప్‌లో ఉన్న సుమారు 20 దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి వచ్చారని తెలిపారు.
9/13
సీఎం చంద్రబాబు, తాను ఏ దేశం వెళ్లినా ముందు తెలుగువారిని కలిశాకే అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నామన్నారు.
10/13
గతేడాది ఏపీ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభమైందని గుర్తు చేశారు. మీతో సమావేశమైన తర్వాత దావోస్ సమావేశానికి హాజరయ్యామన్నారు. అక్కడి నుంచి తిరుగు లేదని చెప్పారు.
11/13
ఈ 18 నెలల్లో రూ. 23.50 లక్షల కోట్లు పెట్టుబడులు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. భారత్‌లో వచ్చిన పెట్టుబుడుల్లో 25.3 శాతం ఒక్క ఏపీకే వచ్చాయని గుర్తు చేశారు.
12/13
ఈ రోజు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూస్తున్నారంటే.. అందుకు కారణం చంద్రబాబు అని తెలిపారు. ఆయన చాలా రేర్ పీస్. ఆయన్ను మనం అనుసరిస్తే చాలని మంత్రి లోకేశ్ తెలిపారు.
13/13
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగుజాతి గర్వపడేలా పని చేద్దామని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వారిని అభివర్ణించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి. మీరు పని చేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఏపీ గురించి చెప్పండంటూ ప్రవాసాంధ్రులకు లోకేశ్ స్పష్టం చేశారు.
Updated at - Jan 20 , 2026 | 08:55 AM