సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక

ABN, Publish Date - Mar 15 , 2026 | 06:40 AM

నారా, నందమూరి కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ (ధోతీ వేడుక) శనివారం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక 1/5

నారా, నందమూరి కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ (ధోతీ వేడుక) శనివారం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది.

సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక 2/5

హైదరాబాద్‌లోని నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక 3/5

ఈ వేడుకలో దేవాన్ష్‌ను చూసి తాతలు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ మురిసిపోయారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేవాన్ష్‌కు నూతన వస్త్రాలను బహుకరించి, ఆశీర్వదించారు.

సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక 4/5

అమ్మమ్మ వసుంధర, నాన్నమ్మ భువనేశ్వరిల ఆశీస్సులు, మేనమామల ఆత్మీయతల మధ్య ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. ఆడంబరాలకు పోకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

సంప్రదాయబద్ధంగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక 5/5

దేవాన్ష్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు.

Updated at - Mar 15 , 2026 | 06:41 AM