గూగుల్ ఏఐ డేటా హబ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 28 , 2026 | 03:12 PM
విశాఖపట్నంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్‌కు కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. గురువారం (28-04-2026) జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, పలువురు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
1/12
విశాఖపట్నంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్‌కు కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు.
2/12
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, పలువురు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
3/12
మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
4/12
1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తోంది.
5/12
2028 నాటికి ఈ మూడు డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గూగుల్ సంస్థ ఉంది.
6/12
తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
7/12
దీని కోసం తర్లువాడలో 266.6 ఎకరాల భూమిని కేటాయించింది.
8/12
అడవివరంలో 160 ఎకరాల భూమిని కేటాయించింది.
9/12
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
10/12
గూగుల్ ఏఐ హబ్‌తో 1.88 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయి. దీని నిర్మాణ దశలో 60 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది.
11/12
గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖపట్నం ముఖ చిత్రం మారనుంది.
12/12
ఏఐ డేటా హబ్‌గా, సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌గా తూర్పు కోస్తా తీర నగరం అవతరించబోతోంది.
Updated at - Apr 28 , 2026 | 03:17 PM