ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ
ABN, Publish Date - Mar 01 , 2026 | 09:25 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం (01-03-2026) పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, ఏపీ హైకోర్టు అతిథి గృహం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
1/7
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం (01-03-2026) పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, ఏపీ హైకోర్టు అతిథి గృహం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
2/7
జస్టిస్ సూర్యకాంత్‌తోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
3/7
అంతకుముందు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దర్శించుకున్నారు. ఆనంతరం రాజధాని అమరావతికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
4/7
ఈ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత విజయవాడ వేదికగా జరిగిన ఆర్బిట్రేషన్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
5/7
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం (మీడియేషన్) అనేది భారత్ డీఎన్ఏలోనే ఉందని స్పష్టం చేశారు. మహాభారతంలో శ్రీ కృష్ణ భగవానుడు మొదటి మధ్యవర్తి(మీడియేటర్)గా వ్యవహరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
6/7
ఆ మధ్యవర్తిత్వంలో శ్రీకృష్ణుడు విజయం సాధించలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
7/7
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) విజయానికి ఉదాహరణ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Updated at - Mar 01 , 2026 | 09:26 PM