విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్

ABN, Publish Date - Nov 13 , 2026 | 08:23 PM

విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ స్టాళ్లను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీల ఉత్పత్తులను వారు పరిశీలించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 1/9

విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ స్టాళ్లను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీల ఉత్పత్తులను వారు పరిశీలించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 2/9

ప్రెసిషన్ ఇంజనీరింగ్ - ఎలక్ట్రికల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, మెటీరియల్, మొబిలిటీ సొల్యూషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా అండ్ మెడ్‌టెక్ స్టాళ్లను పరిశీలించారు. ఆర్టీఐహెచ్ ఇన్నోవేషన్స్, అగ్రిటెక్, మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన స్టాళ్లను వారు సందర్శించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 3/9

ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ సెంటర్లలో 45 కంపెనీల ఉత్పత్తులను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరిశీలించారు. ఆయా రంగాల్లో ఉత్పత్తి చేపడుతున్న సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 4/9

ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు.. ఆదాయం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 5/9

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అందిస్తున్న సహకారంతో సంస్థను ప్రారంభించినట్టు పలువురు పారిశ్రామికవేత్తలు వెల్లడించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 6/9

ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎరేటర్స్, ఇన్సులేషన్లను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరిశీలించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 7/9

వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 8/9

పెద్ద పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సాహం ఇచ్చేలా మోటివేట్ చేస్తున్నామని వెల్లడించారు.

విశాఖలో ఎంఎస్ఎంఈ స్టాళ్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గోయల్ 9/9

ఎంఎస్ఎంఈ కంపెనీలు ఐపీఓకు వెళ్లేందుకు అవసరమైన సేవలు అందించేందుకు వచ్చిన అధికారులతో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు.

Updated at - Nov 13 , 2026 | 08:53 PM