పాల్వంచ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం దంపతులు
ABN, Publish Date - Nov 26 , 2026 | 09:15 PM
ఈరోజు (గురువారం) తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.
1/6
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.
2/6
ఆ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.
3/6
పాల్వంచకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
4/6
కాగా దాదాపు 12 ఏళ్ల తరువాత కొత్తగూడెంకు ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
5/6
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం వందలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
6/6
తన కోసం వచ్చిన అభిమానులకు చంద్రబాబు అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు.
Updated at - Nov 26 , 2026 | 10:03 PM